తెలంగాణ ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్ కు అనుతించాలని స్పీకర్ ను కోరింది బీఆర్ఎస్. అప్పుల విషయంలో అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సభా హక్కుల ఉల్లంఘన కింద అసెంబ్లీలో స్పీకర్ ను కలిసి ప్రివిలేజ్ మోషన్ నోటీసులిచ్చారు బీఆర్ఎస్ నేతలు.
తెలంగాణ అప్పులు రూ. 3. 90 లక్షల కోట్లు అని ఆర్బీఐ చెబితే.. కాదు 6.90 లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఇవన్నీ తప్పుడు లెక్కలు ..అందుకే భట్టిపై స్పీకర్ కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చాం..సభలో చర్చకు అనుమతివ్వాలని కోరామన్నారు కేటీఆర్.
ALSO READ | స్పీకర్ ఛాంబర్లో బీఏసీ భేటీ.. హాజరైన సీఎం రేవంత్, హరీశ్
మరో వైపు స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం కొనసాగుతోంది.స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు. హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, యేలేటి మహేశ్వర్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై చర్చిస్తున్నారు.