రేవల్లి మండలంలో..బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్​లో చేరారు

రేవల్లి, వెలుగు : మండలానికి చెందిన బీఆర్ఎస్  పార్టీ నేతలు గురువారం కాంగ్రెస్  పార్టీలో చేరారు. గాంధీ భవన్ లో జడ్పీటీసీ బోర్ల భీమన్న, పీఏసీఎస్​ చైర్మన్  రఘు, మాజీ ఎంపీపీ జానకీరాంరెడ్డి, లక్ష్మణ్ లకు జిల్లెల చిన్నారెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ భీమయ్య మాట్లాడుతూ

కాంగ్రెస్​ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని, మండల అభివృద్ధి కోసం కార్యకర్తల అభిప్రాయంతో కాంగ్రెస్  పార్టీలో చేరినట్లు చెప్పారు. ప్రతాప్ రెడ్డి, చెన్నకేశవులు, మల్లేశ్​ పాల్గొన్నారు.