మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అబద్ధాలు:ఎమ్మెల్సీ కవిత

  •  శ్రీధర్​బాబు సభను తప్పుదోవ పట్టిస్తుండ్రు 
  • దీనిపై కాంగ్రెస్ ను వదిలే ప్రసక్తి లేదు 
  • బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత ​ 

హైదరాబాద్‌: మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్​అబద్దాలు చెబుతుందని,  ఈ విషయంలో కాంగ్రెస్​ప్రభుత్వాన్ని వదలిపెట్టే ప్రసక్తి లేదని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కవిత అన్నా రు.  ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్​వద్ద ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్​తో కలిసి మీడియాతో మాట్లాడారు.  బీఆర్ఎస్​ సభ్యులు మండలిలో అడిగిన ప్రశ్నలకు ప్రభు త్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో మంత్రి శ్రీధర్‌బాబు సభను తప్పుదోవ పట్టించారన్నారు.

‘మూసీ ప్రాజెక్ట్‌ కోసం ప్రపంచ బ్యాంకు రుణం అడగలేదని శ్రీధర్‌బాబు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో రుణం అడిగినట్లు సాక్ష్యాధారాలు బయటపెడుతున్నాం.  డీపీఆర్‌ లేదని అసెంబ్లీలో చెబుతున్నారు.  ప్రపంచబ్యాంకుకు సెప్టెంబర్ 19న ఇచ్చిన నివేదికలో డీపీఆర్‌ ఉంది .  అబద్ధాలు ఎందుకు?  ఎవరి లాభంకోసం ఇదంతా చేస్తున్నారు? ప్రజలకు స్పష్టత ఇవ్వాలి.  

బీఆర్ఎస్​ అధికారంలో ఉండగా ప్రపంచ బ్యాంకును తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం రెడ్‌కార్పెట్‌ వేస్తోంది.  కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రూ.14వేల కోట్ల సాయం అడిగారు’ అని కవిత అన్నారు.