చేతులకు సంకెళ్లు, నల్లచొక్కాలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీకి   బ్లాక్ డ్రెస్ లు,  చేతులకు బేడీలు  వేసుకుని వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. లగచర్ల ఘటన  రైతులకు సంఘీభావంగా ఆందోళన చేశారు. రైతులకు బేడీలు వేయడం సిగ్గు చేటు..ఇదేమి రాజ్యం.. ఇదేమీ రాజ్యం..దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరో వైపు రెండో రోజు అసెంబ్లీ సెషన్ మొదలైంది.  తెలంగాణ అప్పులపై   కాంగ్రెస్,  బీఆర్ఎస్  మధ్య హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది.  . ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ గత పదేళ్లలో  7 లక్షల కోట్లు అప్పులు చేసిందని భట్టి విక్రమార్క అన్నారు.  భట్టి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని..  తాము 4 లక్షల కోట్ల అప్పులు మాత్రమే  చేశామని హరీశ్ రావు చెప్పారు.  కాంగ్రెస్ ఏడాది పాలనలో లక్షా 29 వేల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు.