తెలంగాణ అసెంబ్లీలో రభస.. సభ జరుగుతున్న సమయంలో.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై చర్చ జరపాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. సీట్లలో కూర్చోకుండా.. ప్లేకార్డులతో నిరసనకు దిగారు. స్పీకర్ ఎంత సర్దిచెప్పినా వినకుండా.. నిబంధనలకు విరుద్దంగా పోడియం వైపు దూసుకొచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు.
హరీశ్ రావు ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యేలు పోడియం వైపు వెళుతుంటే.. సభలోని మార్షల్స్ అడ్డుకున్నారు. అయినా వినకుండా.. బలంగా తోసుకొచ్చారు. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తోపులాట జరిగింది. మార్షల్స్ నెట్టేస్తూ.. పోడియం దగ్గరకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పేపర్లు చింపి గాల్లోకి ఎగరేశారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రభస వీడియో మీరే చూడండీ..
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల రభస.. స్పీకర్ పోడియం వైపు ఎలా దూసుకొస్తున్నారో చూడండీ..#BRSParty #CongressParty #TelanganaAssembly2024 #Hyderabad pic.twitter.com/XhgV17WQFw
— raghu addanki (@raghuaddanki1) December 20, 2024