మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. భారీగా పోలీసుల మోహరింపు

రంగారెడ్డి జిల్లా: మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మునిసిపాలిటీలో పుప్పాల గూడ క్రిన్స్ విల్లాస్లో హరీష్ రావు ఉంటున్నారు. హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణకు హాజరుకానున్న క్రమంలో హరీష్ రావు హౌస్ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది.

ఫార్ములా– ఈ రేసుకు సంబంధించిన అన్ని అగ్రిమెంట్లు నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలోనే జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు జరిపామని ఏసీబీ ఎదుట సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్​ అర్వింద్​కుమార్​ వెల్లడించిన సంగతి తెలిసిందే. రేస్​ నిర్వహణ కోసం ఎంఏయూడీ, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ నిధులను ఎట్ల ఖర్చు చేయాలనుకున్నది కూడా కేటీఆరే​ చెప్పారని ఆయన అన్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే హెచ్​ఎండీఏ బోర్డు నుంచి  నిధులు ట్రాన్స్​ఫర్​ చేసినట్లు ఈడీ ముందు హెచ్​ఎండీఏ మాజీ చీఫ్​ ఇంజనీర్​ బీఎల్​ఎన్​రెడ్డి స్పష్టం చేశారు.

Also Read :- గ్రామీణాభివృద్ధి శాఖకు మరో వెయ్యి కోట్లు ఇవ్వండి

ఫార్ములా–ఈ రేస్​ కేసు విచారణలో భాగంగా బుధవారం ఏసీబీ ముందు అర్వింద్​కుమార్.. ఈడీ ముందు బీఎల్​ఎన్​రెడ్డి హాజరయ్యారు. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని ఏసీబీ హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు అర్వింద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌  చేరుకున్నారు. ఎస్పీ, ఇద్దరు అడిషనల్‌‌‌‌‌‌‌‌ ఎస్పీలు సహా మొత్తం ఐదుగురు సభ్యుల టీమ్‌‌‌‌‌‌‌‌.. సాయంత్రం 4.30 గంటల వరకు ఆయన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రికార్డ్ చేసింది. 2023 ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా–ఈ రేస్​ సీజన్‌‌ 9 కోసం రూ.12 కోట్లు చెల్లించడం,  ఫార్ములా ఈ ఆపరేషన్స్, స్పాన్సర్  ఏస్‌‌ నెక్ట్స్‌‌ జెన్‌‌ మధ్య తలెత్తిన చెల్లింపుల వివాదం నేపథ్యంలో ఏస్‌‌ నెక్ట్స్‌‌జెన్‌‌ సీజన్‌‌ 10 నిర్వహణ నుంచి తప్పుకోవడం,  ఆ తర్వాత అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశాల మేరకు ఎంఏయూడీ, ఎఫ్‌‌ఈవో మధ్య 2023 అక్టోబర్‌‌‌‌ 10న ఏ విధంగా అగ్రిమెంట్​చేసుకున్నదీ ఏసీబీ అధికారులకు అర్వింద్​కుమార్​ వివరించినట్లు తెలిసింది.