సభలో హరీష్ రావు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్.. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై షార్ట్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘యూజ్ లెస్ ఫెలో’ అని హరీష్ అనడంతో ఒక్కసారిగా సభ్యులు అభ్యంతరం చెప్పారు. 

ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కల్పించుకొని.. హరీష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  హరీష్ రావు లాంటి సీనియర్ ఇలా మాట్లాడటం క్షమించరాని నేరం అని మండి పడ్డారు. తమ ప్రభుత్వం హామీలను అమలు చేస్తుంటే కడుపు మంటతో బీఆర్ఎస్ నేతలు తప్పడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దోచుకొని అప్పుల పాలు చేశారని, దొంగే దొంగ అన్నట్లు బీఆర్ఎస్ నేతల తీరు ఉందని విమర్శించారు. హరీష్ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.

ALSO READ | దుబారా కాదు.. సంక్షేమమే.. అసెంబ్లీలో లెక్కలతో సహా డిప్యూటీ సీఎం భట్టి వివరణ

హరీష్ రావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. దీనికి హరీష్ స్పందింస్తూ.. సభలో ఎవరో సభ్యులు దొంగ.. దొంగ.. అని అనడం తను విన్నానని, వారు క్షమాపణ చెబితే తాను కూడా చెబుతానని అన్నారు. సభ్యులు అన్నది వినిపించలేదని, కానీ మైక్ లో మాట్లాడిన హరీష్ వ్యాఖ్యలు వినిపించాయని మంత్రి అన్నారు. ఇక స్పీకర్ కల్పించుకొని వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు.