కాంగ్రెస్​లోకి బీఆర్ఎస్ నేతలు

పాలమూరు, వెలుగు: భూత్పూర్  మండలం మద్దిగట్ల గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ కు చెందిన 80 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్ వంశీచంద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. భూత్పూర్  మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరగా, వారికి కాంగ్రెస్​ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం భూత్పూర్  మండలం మద్దిగట్లలో జరిగిన పోచమ్మ బోనాల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చిన మహిళలతో ముచ్చటించిన వంశీచంద్ రెడ్డి వారిలో జోష్  నింపారు. మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు.