ఆడబిడ్డలంటే బీఆర్​ఎస్​కు అంత చిన్న చూపేంది?

భారతదేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  తెలంగాణ తొలి మహిళా గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ, తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధినేత్రి సోనియాగాంధీ, తెలంగాణ  ప్రత్యేక రాష్త్ర ఏర్పాటును లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో ప్రకటించిన మాజీ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీరాకుమారి, దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, అంతరిక్ష పరిశోధనల్లో పాల్గొన్న కల్పనా చావ్లా,  క్రీడాకారిణులు మిథాలీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైనా నెహ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  పీటీ ఉష... ఇలా చెప్పుకుంటూపోతే అన్ని రంగాల్లోనూ దేశ ప్రతిష్టను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మహిళామణులు ఎందరో  భారతదేశంలో ఉన్నారు.  ప్రజాస్వామ్యానికి  నాలుగు స్తంభాలుగా  అభివర్ణించే  లెజిస్లేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జ్యుడీషియల్,  ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగాల్లో మహిళలు అత్యున్నత స్థాయిల్లో  రాణిస్తున్నారు. మగవాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా సమానస్థాయి నైపుణ్యాలను  ప్రదర్శిస్తున్నారు.  గ్రామస్థాయి నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకూ ఎందరో మహిళా నాయకురాళ్లు ఉత్తమ ప్రజాపాలనను అందించి దేశ గౌరవాన్ని పెంచుతున్నారు. 

మహిళలను కించపరిచిన బీఆర్​ఎస్​

రాజకీయ దురుద్దేశంతో, మీడియా ప్రచారం కోసం మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం తన అహంకారానికి నిదర్శనం. కాంగ్రెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తోంది.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలో ఉండగా ఏనాడూ మహిళలకు సముచిత స్థానం కల్పించిన దాఖలాలు లేవు.  మహిళలపై వివక్ష చూపటం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధినాయకుడి డీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏలోనే ఉన్న లక్షణంగా వారి వ్యవహార తీరు ఉండేది.  అందుకు నిదర్శనంగా  స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో మొదటగా అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మంత్రివర్గంలో  కనీసం ఒక్కరికీ కూడా చోటు కల్పించలేని వాస్తవాన్ని మననం చేసుకోవచ్చు.  గత పదేండ్ల కాలంలో మహిళలపై జరిగిన అత్యాచారాలపై, మహిళల హక్కుల కోసం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ తరఫున ఎవరూ మాట్లాడలే.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రభుత్వం తరఫున  ఒక్కరూ స్పందించలే. నేడు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డిని గతంలో హోంమినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి గౌరవించింది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ అని తెలియదా?  తెలంగాణ సమాజం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులను చీదరించుకుని బహిష్కరిస్తే.. అస్తిత్వం కోసం చౌకబారు విమర్శలు చేయడమనేది వెర్రితనమే అనిపిస్తుంది తప్ప సమాజం హర్షించదు. దిగజారుడు మాటలతో నిత్యం మీడియాలో ఉండాలనుకోవడం మూర్ఖత్వమే. అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదని గుర్తుంచుకోవాలి.  దీన్ని తెలంగాణ సమాజం స్వాగతించదు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి  గెలుపుకోసం  ప్రచారం చేసిన భార్య,  కూతురు తెలంగాణ  ఆడపడుచులే అని కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి  గుర్తుంచుకోవాలి.  ప్రజాప్రతినిధిగా వివక్షకు గురయ్యే మహిళలను ఆదరించాల్సిందిపోయి.. ఇలా చౌకబారు విమర్శలు చేయడం  హేయం.  

తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి..కేవలం పార్టీ మారిన ఎమ్మెల్యేలనే విమర్శించినట్లు కాదు.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు తెలంగాణ ఆడపడుచుగా చెప్పుకుంటున్న .. మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గారాల కూతురు కల్వకుంట్ల కవితనూ పరోక్షంగా విమర్శించినట్లే.  తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన తీరుపై  స్పందించాల్సిన అవసరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకూ ఉంది.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలో ఉన్నప్పుడు 2019వ  సంవత్సరంలో 'నేటి ఫిరాయింపులే.. రేపు ఫిరంగులై పేలుతాయి' అని ఓ వ్యాసంలో  నేను చెప్పిన మాటలే నేడు నిజమయ్యాయి.  తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధినాయకుడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... పార్టీ  ఫిరాయింపులను ప్రోత్సహించిన సంగతి తెలంగాణ యావత్తు సమాజానికి తెలుసు.  బుడింకాయల దొంగలు ఎవరంటే.. నేనుకాదు, నేనుకాదు అన్నచందంగా నేడు పార్టీ  ఫిరాయింపులపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు.  2014 నుంచి 2018 వరకూ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్నారు. 2018 నుంచి 2023 వరకూ 14 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు.  అంటే,  మొత్తంగా  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలో ఉండగా 38 మంది ఎమ్మెల్యేలను  నయాన్నో  భయాన్నో  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కలుపుకున్నారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి అండగా తెలంగాణ ప్రజలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి తెలంగాణ ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసే సంపూర్ణ మెజారిటీ 64 స్థానాలను ఇచ్చారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడి నెలతిరగకముందే  ప్రభుత్వం పడిపోతుంది అంటూ చవకబారు రాజకీయాలకు పాల్చడితే.. పార్టీని,  ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధినాయకత్వం చేర్చుకుంటుందే తప్ప  ప్రతిపక్షాలను  నిర్వీర్యం చేయాలని ఎంతమాత్రం కాదు. ఈ విషయాన్ని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు, బీజేపీ నాయకులు గుర్తెరగాలి.  రాజకీయాలు అనేవి హుందాగా ఉండాలి.  రాజకీయ నాయకులుగా మనం  ప్రజలకు  జవాబుదారీతనంగా వ్యవహరించాలి. అంతేగాని  రాబోయేతరానికి రాజకీయాలపై చెడు అభిప్రాయం కలిగేలా విమర్శలు, వ్యాఖ్యలు చేయకూడదు. ఇకనైనా పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి చిల్లర మల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాల్చిన అవసరం ఉంది. 'మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడు ఏమైపోయినాడో ఈ సమాజానికి తెలుసు.. అలాగే  తెల౦గాణ మహిళలను అగౌరవపరిస్తే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులకు ఏ గతి పడుతుందో తెలుసుకోవాలి.  తెలంగాణ ఆడబిడ్డలు వంటిళ్లకే  పరిమితం అవుతారు అనుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు.  ఇలాగే  వ్యవహరిస్తే  రాష్ట్ర  మహిళామణులు  బీఆర్ఎస్​కు  గుణపాఠం చెప్పకతప్పదు.


కౌశిక్​రెడ్డి వ్యాఖ్యలు కేటీఆర్​కు వినిపించడం లేదా?

కవిత లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కేసులో జైలుకు వెళితే ఏ సంబంధం లేని తెలంగాణ ఆడబిడ్డలకు కష్టం వచ్చిందని చెప్పిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లీడర్లు,  మాజీ మహిళా మంత్రులను అసెంబ్లీలో సీఎం అవమానపరిచాడని యావత్తు మహిళలకు ఇది అవమానమని చెప్పిన  కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈనాడు  కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి చూపిన చీర, గాజులు కనిపించడంలేదా.. చేసిన వ్యాఖ్యలు వినిపించడం లేదా?

- ఇందిరా శోభన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,
రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకురాలు