గాల్లోకి బీఆర్ఎస్ లీడర్ ఫైరింగ్​

  • రంగారెడ్డి జిల్లాలో ఘటన
  • సోషల్​ మీడియాలో వీడియో  హల్​చల్​
  • ఎయిర్​గన్​గా తేల్చిన పోలీసులు 

ఇబ్రహీంపట్నం, వెలుగు :   బీఆర్ఎస్ లీడర్, భువనగిరి  ఎంపీగా పోటీ చేసిన క్యామ మల్లేశ్ ​రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్​పల్లిలో గన్​తో గాల్లోకి కాల్పులు జరిపారు. దసరా సందర్భంగా సొంత గ్రామం శేరిగూడ  సమీపంలోని మంగళ్​పల్లిలోని తన వ్యవసాయ భూమిలో కుటుంబసభ్యులతో కలిసి ఆయుధ పూజ చేశారు. ఆ తర్వాత గన్​తో గాల్లోకి ఒక రౌండ్ ​కాల్పులు జరిపారు. ఈ వీడియో  సోషల్ ​మీడియాలో వైరల్​గా మారింది.

 పోలీసుల దాకా వెళ్లడంతో గన్​కు సంబంధించిన పేపర్లను తెప్పించుకుని పరిశీలించారు. చివరకు అది ఎయిర్​గన్​ అని, ప్రాక్టీస్ ​కోసం తెచ్చుకున్నాడని సీఐ సత్యనారాయణ తెలిపారు. రెండేండ్ల కింద ఇబ్రహీంపట్నం పీఎస్  పరిధిలోని శేరిగూడలో దసరా పండుగ సందర్భంగా ఓ బీఆర్ఎస్ లీడర్ ​గన్ తో గాల్లోకి కాల్పులు జరపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.