సాగు చేయని భూములకు రైతుబంధు.. రూ. 21 వేల 283 కోట్లు వృథా

గత BRS సర్కార్ సాగు చేయని భూములకు రైతుబంధు నగదు వేసింది. సాగు చేయని భూములకు రైతుబంధు ఇవ్వడంతో ప్రభుత్వానికి మరింత భారం పడింది. ఇందుకు సంబంధించిన లెక్కను ప్రభుత్వం విడుదల చేసింది. 

2019-20లో 68.93 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చింది. ఇందుకోసం 3 వేల 446.04 కోట్లు చెల్లించింది. అలాగే 2020-21లో 88.80 లక్షల ఎకరాలకు 4 వేల 425.29 కోట్ల రైతుబంధు నిధులు ఖాతాల్లో జమ చేసింది. ఇక 2021-2022 సంవత్సరానికి 82.61 లక్షల ఎకరాలకు 4 వేల 130.69 కోట్లు రిలీజ్ చేసింది. 2022-23 ఏడాదికి గానూ 88.12 లక్షల ఎకరాల సాగు చేయని భూమికి 4 వేల 406.02 కోట్ల రైతుబంధు చెల్లించింది.

 ఇక 2023-24లో అత్యధికంగా 97.51 లక్షల ఎకరాలకు 4 వేల 875.62 కోట్లు రైతుబంధు ఇచ్చింది. మొత్తం ఆరేళ్లలో 21 వేల 283.66 కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృథా చేసింది BRS. సాగు చేయని ఈ భూముల్లో ఎక్కువగా గుట్టలు, పుట్టలు, పాడుబడిన భూములు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.