విద్యార్థుల చావుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఫ్యామీలీపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థుల చావుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని గరం అయ్యారు. డీఎస్సీ వాయిదా పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ పదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ వేసింది లేదని విమర్శించారు. యువకులు మధ్యవయస్కులుగా మారిపోయారు చెప్పారు.  కోచింగ్ సెంటర్లను వెంటేసుకుని కేసీఆర్ హరీష్  విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు సీఎం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

 పరీక్షల వాయిదాకు దమ్ముంటే ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ధర్నా చేయండని అన్నారు. పరీక్షలు నిర్వహించడం కోసం కేసీఆర్ కుటుంబం దీక్షలో కూర్చోవాలని సూచించారు. తాము 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. నాలుగు రోజులుగా కేటీఆర్ హరీష్ రావు మోదీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.  పరీక్షలు వాయిదా వేస్తే పేద నిరుద్యోగులు నష్టపోతారని అన్నారు. 

తాను ముఖ్యంత్రిని అయినా కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటానని తెలిపారు రేవంత్. ఈ ప్రాంత అభివృద్ధికి మనం పునాధులు వేసుకోవాలని సూచించారు. మీ కష్టాల వల్లే మాకు పదవులొచ్చాయని చెప్పారు. ఎవరైతే కష్టపడ్డారో వారికే పదవులు ఇస్తామని తెలిపారు. కార్యకర్తలు అండగా ఉంటే విజయం సాధించవచ్చిన నిరూపించారని కార్యకర్తల కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తిరుగుతారని చెప్పారు. 

కేసీఆర్ కి ముందుంది ముసళ్ల పండగా అని బీఆఱ్ఎస్ పాతాళానికి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. కార్యకర్తల సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం స్వీకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.