ఉప్పల్, వెలుగు: భిక్షాటన చేస్తున్న అన్న ఇంటికి వచ్చినందుకు భార్యను భర్త మందలించడంతో ఆమె సూసైడ్ చేసుకుంది. ఉప్పల్ పీఎస్ పరిధిలోని చిలకనగర్‌కు చెందిన నరేశ్, మహేశ్వరి (29)కి పదేండ్ల కిందట పెండ్లి జరిగింది. మహేశ్వరి తల్లిదండ్రులు రెండేండ్ల కింద చనిపోగా, ఆ కుటుంబానికి దూరంగా ఉంటోంది.
ఆమె అన్న మహేశ్ రోడ్ల పై అడుక్కుంటున్నాడు. శనివారం సాయంత్రం మహేశ్ చిలుకా నగర్ లో ఉండే చెల్లి మహేశ్వరి ఇంటికి వచ్చి మాట్లాడాడు. అది చూసిన నరేశ్ తన భార్యను మందలించి కొడుకును తీసుకొని బయటికి వెళ్లాడు. తరువాత వచ్చి కిటికీ లోంచి చూడగా మహేశ్వరి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి పెదనాన్న కూతురు బొడ్డుపల్లి లింగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.