కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీకి చెందిన 44 బ్రిడ్జ్ లను ప్రారంభించారు. ఆర్మీ బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ దేశ సరిహద్దుల్లో మొత్తం 102 బ్రిడ్జ్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది. అందులో 44బ్రిడ్జ్ లు పూర్తయ్యాయి. వాటిలో 30 బ్రిడ్జ్ లు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రల్ లఢాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జ్ లు ఆర్మీకి చెందిన భారీ యుద్ద ట్యాంకుల రవాణా కోసం ఉపయోగించనున్నారు. ఇవి జమ్మూ కాశ్మీర్ (10), లడఖ్ (8), హిమాచల్ ప్రదేశ్ (2), పంజాబ్ (4), ఉత్తరాఖండ్ (8), అరుణాచల్ ప్రదేశ్ (8), సిక్కిం (4) లో 44 వంతెనలను నిర్మించినట్లు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ తెలిపారు
70 టన్నుల యుద్దట్యాంకుల బరువును మోసే సత్తా ఈ బ్రిడ్జీల సొంతం
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో చైనా ఆర్మీ ఆక్రమణల్ని తిప్పికొట్టేందుకు భారత్ తూర్పు లడఖ్ సెక్టార్ కు టీ – 90 భీష్మ యుద్ధ ట్యాంకుల్ని మోహరించింది. ఆ యుద్ధ ట్యాంక్ బరువు 45టన్నులు ఉండగా…భారత్ నిర్మించిన 102 బ్రిడ్జ్ లు 70టన్నుల బరువు మోయగల సామర్ధ్యం ఉంది. వీటి వల్ల ప్రదేశాల మధ్య దూరాల్ని త్వరగా చేరుకునేందుకు , ఎల్ ఓసీ వద్ద అత్యవసర పరిస్థితుల్లో సైనికుల్ని మోహరించేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది 102 బ్రిడ్జీల నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. తద్వారా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కోసం చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. చైనాను నిలువరించేలా సరిహద్దు ప్రాంతాల్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రధానిమోడీ కసరత్తులు చేస్తున్నారు.
ఇందులో భాగంగా గత ప్రభుత్వాల కంటే ప్రధాని మోడీ దేశ రక్షణ కోసం భారీ స్థాయిలో నిధుల్ని కేటాయించారు. ఆర్మీ బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) కోసం 2008-2016లో రూ .3,300 కోట్ల నుంచి రూ .46,00 కోట్ల మధ్య ఉన్న బీఆర్‌ఓ వార్షిక బడ్జెట్ గణనీయంగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 2020 లో బీఆర్వో వార్షిక బడ్జెట్ రూ .11,000 కోట్లకు చేరిందని ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.
