సూర్యకుమార్ సిక్సర్ల మోత..

సూర్యకుమార్ సిక్సర్ల మోత..

మూడో టీ20లో వెస్టిండీస్ కు భారత్ 185 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది భారత్.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులతో నిరాశ పరిచినా..మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 పరుగులతో రాణించాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యార్ 25, రోహిత్ 7 పరుగులకే ఔటయ్యారు. దీంతో కష్టాల్లో పడ్డ ఇండియాను సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యార్ ఆదుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ 65 పరుగులతో చెలరేగాడు. 31 బంతుల్లో 7 సిక్సులు, ఒక ఫోర్ తో చెలరేగి ఆడిండు..సూర్యకు జతగా వెంకటేశ్ అయ్యార్ 19 బంతుల్లో 2 సిక్సులు, 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 184 పరుగులు చేయగల్గింది. 

 

మరిన్ని వార్తలు