తల్లిపాలు పిల్లలకు అమృతంతో సమానం : సంక్షేమాధికారి బ్రహ్మాజీ

మెదక్​టౌన్, వెలుగు: తల్లిపాలు బిడ్డకు అమృతంలాంటివని జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ అన్నారు. శనివారం మెదక్​ పట్టణంలోని పిట్లంబేస్​లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య హాజరై మాట్లాడారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ప్రభుత్వం అంగన్​వాడీ కేంద్రాల్లో అందించే ప్రీ స్కూల్​బోధనను వినియోగించుకోవాలన్నారు. గర్భిణులు, బాలింతలు, కౌమారదశలోని బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో సీడీపీవో నీలిమ, సూపర్​వైజర్​జయంతి, కౌన్సిలర్​గాయత్రి, టీచర్లు రేణుక, స్మరణ, మహిళా శక్తి కేంద్రం బాధ్యులు సంతోషిణి, సఖి సెంటర్​ బాధ్యులు రేణుక, ఆశా వర్కర్ మంజుల, తదితరులు పాల్గొన్నారు. 


సిద్దిపేట రూరల్: తల్లి పాల వారోత్సవాలను పురస్కరించుకొని సురభి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి సీఐలు దుర్గ, లక్ష్మీబాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డను కనిపెంచడం లో తల్లి పాత్ర చాలా కీలకమైనదన్నారు. అలాగే పుట్టిన వెంటనే బిడ్డకు పాలు ఇవ్వడం చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుబ్బతాయి, మెడిసిన్ డిపార్ట్​మెంట్​హెచ్ వోడీ సాయి, సీఈవో ప్రవీణ్ కుమార్, సీఏవో రామకృష్ణ, ఏవో అమృత్ పాల్ సింగ్, పీఆర్ వో పర్శరాములు, రాజేశ్  తదితరులు 
 పాల్గొన్నారు.