ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముమ్మరం అయ్యింది. అధికార ప్రతిపక్ష నేతలంతా రోడ్ షోలు, బహిరంగ సభలతో జనంలో తిరుగుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతోంది. జగన్ బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోంది. అయితే, సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. శనివారం కర్నూలు మీదగా అనంతపురం జిల్లా గుత్తికి చేరుకున్న జగన్ యాత్రకు బ్రేక్ ఇచ్చి ఆదివారం అక్కడే బస చేయనున్నారు.
ఆదివారం ఈస్టర్ ఉన్న కారణంగా జగన్ ఈస్టర్ వేడుకల్లో పాల్గొననున్న నేపథ్యంలో బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.శనివారం ఎక్కడైతే బస్సు యాత్ర ఆగిందో, అక్కడి నుండే సోమవారం ప్రారంభం కానుంది. ఎన్నికలకు కేవలం 40రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సమయాన్ని పూర్తిగా ప్రచారానికి వినియోగించుకునేలా రోడ్ షోలు, బహిరంగ సభలు ప్లాన్ చేసింది వైసీపీ. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం ప్రారంభించిన జగన్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.