వర్డ్​ ఆఫ్​ ది 2024గా బ్రెయిన్ రాట్​​..అంటే ఏంటి.?

ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ ప్రెస్​ వర్డ్​ ఆఫ్​ ది ఇయర్​ – 2024గా బ్రెయిన్​ రాట్​ (Brain Rot)ను ప్రకటించింది. 37 వేల మందికిపైగా పాల్గొన్న పబ్లిక్​ ఓటింగ్ నుంచి ఆరు పదాలను షార్ట్​ లిస్ట్​ చేసి అందులో నుంచి బ్రెయిన్​ రాట్​ను వర్డ్​ ఆఫ్​ ది ఇయర్​గా ఎంపిక చేశారు. నిష్ప్రయోజనకరమైన కంటెంట్​ వినియోగంపై విస్తృత ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని బ్రెయిన్​ రాట్​ అనే పదాన్ని 2024 పదంగా ఎంపిక చేశారు. 

బ్రెయిన్​ రాట్​ అంటే మానసిక లేదా మేధోస్థితి క్షీణించడం. అవసరం లేని కంటెంట్​ను అధికంగా వినియోగించడం వల్ల ఇది కలుగుతుంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో తక్కువ నాణ్యత కలిగిన ఆన్​లైన్​ కంటెంట్​తో ఎక్కువగా మమేకం అయినప్పుడు కలిగే దుష్ప్రభావాలపై ఏడాది కాలంగా ఈ పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. 

ఆంగ్ల రచయిత హెన్రీ డేవిడ్​ 1854లో తాను రాసిన వాల్డెన్​ అనే పుస్తకంలో ఈ పదాన్ని మొదట వినియోగించారు. 

సోషల్​ మీడియాలో బాగా పాపులర్​​ అయిన పదాల్లో డెమ్యూర్​, డైనమిక్​ ప్రైసింగ్​, లోర్​, రొమాంటసీ, స్లోప్​ తదితర పదాలు బ్రెయిన్​ రాట్​తో పోటీపడగా చివరికి ఎక్కువ మంది బ్రెయిన్​ రాట్​కే ఓటు వేయడంతో వర్డ్​ ఆఫ్​ ది ఇయర్​గా నిలిచింది. ​