వావ్​.. బాటిల్​ లో మెసేజ్​.. సముద్రంలో దొరికింది..

కంప్యూటర్​ యుగంలో ఎవరికి ఎలాంటి సమాచారం పంపాలన్నా..క్షణాల్లో పంపేస్తున్నాం.. ఫోన మెసేజ్​.. వాట్సాప్​.. ఇంకా అయితే ఈ మెయిల్​ ద్వారా పంపుతున్నాం... ఇది ఇప్పటి పరిస్థితి.  పూర్వకాలంలో ఎవరికైనా సమాచారం పంపాలంటే.. కొన్ని రోజులు పట్టేది. ఒకప్పుడు ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ఉత్తరాలే గతి. ఓ కాగితంపై సందేశం రాసి పావురాలతో చేరవేసేవారు. లేదా పేపర్ తడవకుండా సీసాలో పెట్టి సముద్ర మార్గంలో పంపేవాళ్లు. ఇప్పడు ఇలాంటివి సినిమాల్లో తప్ప బయట కనిపించడం చాలా అరుదు. అయితే ఇలాంటి అరుదైన సంఘటనే ఆస్ట్రేలియాలో జరిగింది. 

Also Read:-పరకడుపున పాలు తాగుతున్నారా..? హెల్త్కు మంచిదో, కాదో ఇన్నాళ్లకు తెలిసింది..!

ఓ గాజు బాటిల్, అందులో మెసేజ్ రాసి ఉన్న పేపర్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. అలా కొట్టుకొచ్చిన బాటిల్ అక్కడి జాలరి పాల్ ఇలియట్ అతని కొడుకు జ్యాల కంటపడింది. వాళ్లు ఆ బాటిల్ ఓపెన్ చేసి చూస్తే.. అందులో ఓ స్టోరీ రాసి ఉంది. అది యాభై ఏళ్ల క్రితం రాసింది. 50 ఏళ్ల క్రితం పాల్ గిల్మార్ అనే 13 ఏళ్ల పిల్లాడు తన కథను రాశాడు. తను ఓ నావలో దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ఫ్రీమాంటిల్ నుంచి మెల్బోర్న్ కు వెళుతున్నట్లు రాశాడు. 

తాను ఫెయిర్ స్టార్ అనే నౌకలో ప్రయాణిస్తున్నట్లు, ఆ నౌక బ్రిటీషు వలసదారులను ఆస్ట్రేలియాకు మోసుకొచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ వివరాలు రాసి బాటిల్లో ఉంచి దాన్ని సముద్రంలో పడేసాడు. అయితే ఈ బాటిల్ ఎవరికైనా దొరికితే దాన్ని ఫలానా చిరునామాకు తీసుకొచ్చి ఇవ్వాలంటూ మెల్బోర్న్ ఓ అడ్రస్ కూడా రాసి ఉంచాడు. ఈ సందేశం చదివిన ఇలియట్ ఆ కథ రాసిన పిల్లాడు ఎక్కడున్నాడో కనుక్కునే పనిలో పడ్డాడు. 13 ఏళ్లు చిన్నారిగా ఉన్నప్పుడు ఆ సందేశం రాశాడు. ఇప్పుడు ఆ పిల్లాడు పెద్దవాడై 63 ఏళ్ల వయస్సు ఉండొచ్చని ఇలియట్​ అంటున్నాడు.