శబరిమలలో అయ్యప్పలకు ‘బాస్’​ అన్నదానం

బషీర్ బాగ్, వెలుగు:  భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి(బాస్) ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు శబరిమలలోని నీలకల్ మార్గంలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు సమితి అధ్యక్షుడు క్యాతం రాధాకృష్ణ తెలిపారు. అయ్యప్ప మాలధారులకు, భక్తులకు అల్పాహారం,  అన్నదానం, మంచినీరు పంపిణీ చేస్తామన్నారు. 16 ఏండ్లుగా నీలకల్ ప్రాంతంలో వేలాది మంది అయ్యప్ప భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. దాతలు www.helpaneedy.in వెబ్​సైట్ ద్వారా సహాయ సహకారాలు అందించవచ్చన్నారు.