కరోనా వైరస్ పై త్వరలో నిర్ణయం తీసుకొని మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తామన్నారు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్. కరోనా వైరస్ పై మీడియాతో మాట్లాడిన బోరిస్.. వైరస్ వ్యాధిగ్రస్తుల్ని కనిపెట్టడంలో వైద్యులు చాలా కీరోల్ ప్లే చేస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. .
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ వచ్చే క్రిస్మస్ కి వైరస్ తగ్గుముఖం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో కేసుల తీవ్రతను బట్టి లాక్ డౌన్ విధిస్తామన్న ఆయన … సాదారణ స్థితికి రావాలంటే తప్పని సరిగా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
