కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో యూకే ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. బ్రిటన్ వ్యాప్తంగా కఠిన లాక్ డౌన్ విధిస్తున్నట్టు UK ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కరోనా వైరస్ ఓల్డ్ వేరియంట్ పై దేశ ప్రజలు బాగా పోరాడారని…అదే స్పూర్తితో కొత్త వేరియంట్ పై పోరాటం కొనసాగించాలన్నారు బోరిస్ జాన్సన్. లాక్ డౌన్ ప్రకటిస్తూ ఈ కామెంట్స్ చేశారు. కరోనా స్టార్ట్ అయినప్పట్నుంచి… దేశంలోని హాస్పిటల్స్ గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం హాస్పిటల్స్ లో ఉన్న కరోనా పేషెంట్స్ సంఖ్య 27 వేలకు పెరిగింది. ఏప్రిల్ కంటే 40 శాతం కేసులు పెరిగాయి. బోరిస్ జాన్సన్ ప్రకటనతో ఇంగ్లాండ్ మొత్తం లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.
సోమవారం నుంచే స్కాట్లాండ్ కూడా లాక్ డౌన్ లోకి వెళ్లింది. వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ ఇప్పటికే లాక్ డౌన్ లో ఉన్నాయి. నిత్యావసర వస్తువులు, ఇతర అత్యవసర వస్తువుల కోసం మాత్రమే బయటకు వెళ్లేందుకు జనానికి అనుమతిచ్చారు. స్కూల్స్, కాలేజీలు మూతబడనున్నాయి. ఔట్ డోర్ స్పోర్ట్స్ వేదికలు అన్నీ క్లోజ్ కానున్నాయి. ప్రార్థనా మందిరాలు తెరిచే ఉంచనున్నారు.
