మహారాష్ట్ర – కర్నాటక బార్డర్ ఫైట్.. ఇంచు కూడా వదలమంటున్న కర్నాటక

మహారాష్ట్ర – కర్నాటక బార్డర్ ఫైట్.. ఇంచు కూడా వదలమంటున్న కర్నాటక
మరాఠాలెక్కువున్న ప్రాంతాలను కలుపుకుంటాం: ఉద్ధవ్ మరాఠీ ఏరియాలో అంగుళం కూడా మహారాష్ట్రకు ఇవ్వం కర్నాటక సీఎం యడియూరప్ప మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలు సరికాదు కామెంట్‌ బెంగళూరు: కర్నాటక, మహారాష్ట్ర మధ్య బార్డర్ వివాదం మరోసారి భగ్గుమంది. మరాఠీ మాట్లాడేవాళ్లు ఉన్న ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకుంటామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన కామెంట్స్​పై కర్నాటక సీఎం యడియూరప్ప ఫైర్ అయ్యారు. ‘మరాఠీ మాట్లాడేవాళ్లు ఉన్న ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకునేందుకు కట్టుబడి ఉన్నామని థాక్రే కామెంట్స్ చేయడం సరికాదు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధం. బార్డర్ ఇష్యూపై మహాజన్ రిపోర్ట్ ఫైనల్. ఒక ఇంచు భూమిని కూడా ఇచ్చేది లేదు’ అని యడియూరప్ప సోమవారం ట్వీట్ చేశారు. కర్నాటకలో మరాఠీలు కన్నడిగులతో కలిసి జీవనం సాగిస్తున్నారని, అదే తరహాలో మహారాష్ట్ర బార్డర్ జిల్లాల్లో మరాఠీలతో కలిసి కన్నడిగులు సామరస్యంతో జీవిస్తున్నారని గుర్తుచేశారు. ఉద్ధవ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. ‘కర్నాటకలో మరాఠీ మాట్లాడేవాళ్లున్న ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుకుంటాం. బార్డర్ గొడవలో ప్రాణత్యాగం చేసినవారికి ఇదే నిజమైన నివాళి. మేం దీనికి కట్టుబడి ఉన్నాం’ అని మహారాష్ట్ర సీఎం ఆదివారం ట్వీట్ చేశారు. బెళగావి వివాదం ఏమిటీ? ఇండిపెండెన్స్​కు ముందు కర్నాటకలోని బెళగావి, కార్వార్, నిప్పాణి సహా 814 గ్రామా లు ముంబై ప్రెసిడెన్సీలో ఉండేవి. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇవి కర్నాటకలో భాగమయ్యాయి. అయితే కన్నడ మాట్లాడేవాళ్లు ఉన్న 260 గ్రామాలను కర్నాటకకు ఇస్తామని, 814 గ్రామాలు, 3 పట్టణాలను తమకు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రతిపాదన చేసింది. దీన్ని కర్నాటక తిరస్కరించింది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫైనల్ అని కర్నాటక తేల్చి చెప్పింది. తర్వాత రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగినా.. సమస్య పరిష్కారం కాలేదు. మహారాష్ట్ర ఒత్తిడి మేరకు1966లో  కేంద్రం మహాజన్ కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని కొల్లాపూర్, షోలాపూర్, సాంగ్లి జిల్లాలను, కేరళలోని కాసరగోడ్ ను తమ రాష్ట్రంలో కలపాలని కర్నాటక డిమాండ్ చేసింది. 1967లో మహాజన్ కమిటీ కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది. 1972లో దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బెళగావిపై మహారాష్ట్ర డిమాండ్ ను మహాజన్ కమిటీ తిరస్కరించింది. కర్నాటకలోని 260 గ్రామాలను మహారాష్ట్రకు, మహారాష్ట్రలోని 250 గ్రామాలను కర్నాటకకు ట్రాన్స్ ఫర్ చేయాలని రెకమండ్ చేసింది. For More News.. బార్డర్ దాటొచ్చి ఊరు కట్టిన చైనా ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి బీజేపీ మాఫియా పార్టీ.. బండి సంజయ్​ అసలు హిందువేనా? రాష్ట్రంలో రోజుకు లక్ష మందికి టీకా