ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో సత్తా చాటుతున్న బోపన్న

ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో సత్తా చాటుతున్న బోపన్న

పారిస్‌‌: ఇండియా టెన్నిస్‌‌ స్టార్‌‌ రోహన్‌‌ బోపన్న ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో సత్తా చాటుతున్నాడు. ఈ మెగా టోర్నీ మెన్స్‌‌ డబుల్స్‌‌లో తొలిసారి సెమీఫైనల్లో అడుగు పెట్టాడు. తన పార్ట్‌‌నర్‌‌ మెట్వె మిడిల్కూప్‌‌ (నెదర్లాండ్స్‌‌)తో కలిసి టైటిల్‌‌ అందుకునేందుకు మరో రెండు అడుగుల దూరంలో నిలిచాడు.  కానీ, విమెన్స్​ డబుల్స్​లో సానియా మీర్జా పోరాటం మూడో రౌండ్​లోనే ముగిసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో 16వ సీడ్‌‌ బోపన్న–మెట్వె జంట  4–6, 6-–4 , 7–-6 (10/3)తో  లాయ్డ్‌‌ గ్లాస్‌‌పూల్‌‌ (బ్రిటన్‌‌)–హెన్రి హెలియొవార (ఫిన్లాండ్‌‌) ద్వయంపై మూడు సెట్ల పాటు పోరాడి గెలిచింది.    తొలి సెట్‌‌ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న ఇండో–డచ్‌‌ జోడీ సెకండ్‌‌ సెట్‌‌ నెగ్గి స్కోరు సమం చేసింది. హోరాహోరీగా సాగిన మూడో సెట్‌‌లోనూ 3–5తో వెనుకబడిన దశలోబోపన్న–మెట్వె పోరాటం ఆపలేదు. గొప్పగా ఆడుతూ సెట్‌‌ను సూపర్‌‌ టై బ్రేక్‌‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా 0–3తో వెనుకబడ్డా వరుసగా 10 పాయింట్లు సాధించి మ్యాచ్‌‌ నెగ్గారు, దాంతో, ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బోపన్న ఓ గ్రాండ్‌‌స్లామ్‌‌లో  సెమీస్‌‌ చేరుకున్నట్టయింది. బోపన్న చివరగా 2015 వింబుల్డన్‌‌లో సెమీస్‌‌  ఆడాడు. కాగా, గురువారం జరిగే ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ సెమీస్‌‌లో బోపన్న జంట...12వ సీడ్‌‌  మార్సెలో అరెవలో (సాల్వడార్‌‌)–జీన్‌‌ రోజర్‌‌ (నెదర్లాండ్స్‌‌) జోడీతో పోటీ పడుతుంది. కాగా, విమెన్స్​ డబుల్స్​ మూడో రౌండ్​లో ఎనిమిదో సీడ్​ సానియా (ఇండియా)–హ్రడెకా (చెక్​) జంట 4–6, 4–6తో పదో సీడ్​ గాఫ్​–పెగులా (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 

మెద్వెదెవ్‌‌కు సిలిచ్​ షాక్​.. జ్వెరెవ్​ సెమీస్​కు..

మెన్స్‌‌ సింగిల్స్‌‌లో రెండో ర్యాంకర్​ డానిల్‌‌ మెద్వెదెవ్‌‌ కు షాక్‌‌ తగిలింది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్​లో డానిల్‌‌ (రష్యా) 2–6, 3–6, 2–6తో 20వ సీడ్‌‌ సిలిచ్‌‌ (క్రొయేషియా) చేతిలో చిత్తయ్యాడు. తొలి క్వార్టర్స్​లో మూడో సీడ్​ జ్వెరెవ్​ (జర్మనీ) 6–4, 6–4, 4–6, 7-–6 (9/7)తో ఆరో సీడ్​ అల్కరాజ్​ (స్పెయిన్​)ను ఓడించి సెమీఫైనల్​ చేరుకున్నాడు.

మార్టినా, గాఫ్‌‌ మొదటిసారి

విమెన్స్‌‌ సింగిల్స్​లో ఇటలీకి చెందిన మార్టినా ట్రెవిసన్‌‌, అమెరికా టీనేజర్‌‌ కొకొ గాఫ్‌‌ కెరీర్‌‌లో తొలిసారి గ్రాండ్‌‌స్లామ్‌‌ సెమీస్‌‌లో అడుగు పెట్టారు. క్వార్టర్స్‌‌లో 59వ ర్యాంకర్‌‌ మార్టినా 6–2, 6–7 (3/7), 6–3తో 17వ సీడ్‌‌ లేలా ఫెర్నాండెజ్‌‌ (కెనడా)పై నెగ్గింది. సెమీస్‌‌లో తను18వ సీడ్‌‌  కొకొ గాఫ్‌‌తో తలపడనుంది. మరో క్వార్టర్స్‌‌లో 18 ఏళ్ల గాఫ్‌‌ 7–5, 6–2తో తోటి ప్లేయర్‌‌ స్లోన్‌‌ స్టీఫెన్స్‌‌ను ఓడించింది.

మరిన్ని వార్తలు