- మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: ముసురులోనూ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్‌ఫెయిర్ సందడిగా కొనసాగింది. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి గురువారం బుక్‌ఫెయిర్ ను సందర్శించారు. ఏటా జరిగే ఈ కార్యక్రమం అన్ని రకాల పుస్తకాలకు కూడలి లాంటిదన్నారు. విద్యార్థులు యువకులు, పెద్దలందరూ బుక్ ఫెయిర్ ను సందర్శించాలని సూచించారు. నిజాం కాలంలో జైలు గోడలపై దాశరథి రాసిన కవిత్వాలు ఎంతో శక్తివంతమైనవని రచయిత, కవి నందిని సిద్దారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ భాష చైతన్య సమితి ఆధ్వర్యంలో కుసుమ ధర్మన్న కళాపీఠం ముద్రించిన ‘దాశరథి’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలుగు వికీపీడియాపై అందరికీ అవగాహన చాలా అవసరమని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. వికీపీడియా గురించి మీకు తెలుసా? అనే పుస్తకాన్ని ఆయన రిలీజ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, బుక్ ఫెయిర్ అధ్యక్ష కార్యదర్శులు యాకూబ్, వాసు, బాల్ రెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, బడే సాబ్, బొమ్మగాని కిరణ్, అడ్వకేట్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.