అట్టహాసంగా ముగిసిన బుక్ ఫెయిర్

ముషీరాబాద్, వెలుగు : హైదరాబాద్ బుక్ ఫెయిర్ అట్టహాసంగా ముగిసింది. పది రోజులుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 37వ జాతీయ పుస్తక ప్రదర్శనకు ఆదివారం పాఠకులు పోటెత్తారు. ముగింపు సభకు జస్టిస్ రాధారాణి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ రాంచంద్రమూర్తి హాజరై మాట్లాడారు. సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉన్నా పుస్తకాలకు ఆదరణ తగ్గలేదన్నారు. 10 రోజుల్లో 13 లక్షల మంది బుక్​ ఫెయిర్​ను సందర్శించారన్నారు. బుక్ ఫెయిర్ నిర్వాహకులను ఘనంగా సత్కరించారు. 

డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టుకు చెందిన మూడు సాహిత్య చారిత్రక పుస్తకాలను ఆవిష్కరించారు. డాక్టర్ మంగరి రాజేంద్ర రచించిన ‘కోర్టు తీర్పులో సాహిత్య మెరుపులు’, డాక్టర్ ఏమని శివ నాగిరెడ్డి రచించిన ‘తెలంగాణ శిథిలాలు వ్యథా భరిత కథనాలు’, రామోజు హరగోపాల్ రాసిన ‘తెలంగాణ చరిత్ర తొవ్వలో’

పుస్తకాలను బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సీనియర్ జర్నలిస్ట్ కె రామచంద్ర మూర్తి, డాక్టర్ మంగరి రాజేంద్ర కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ వారసత్వాన్ని పరిరక్షించడంలో పుస్తకాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.