పోర్న్ చిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. తక్షణమే విడుదల చేయాలని కోరుతూ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తన పిటిషన్ లో తెలిపారు. తన అరెస్ట్ కు ముందు నోటీసులు ఇవ్వలేదని.. పైగా మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ ఆదేశాలు ఇచ్చిందని ఇచ్చారని వివరించారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు... మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల్లో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేసింది. రాజ్ కుంద్రాకు విధించిన రిమాండ్, జ్యుడిషియల్ కస్టడీ చట్టానికి లోబడే ఉన్నాయని, ఇందులో తాము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులేవీ లేవని జస్టిస్ ఏఎస్ గడ్కరీ ధర్మాసనం స్పష్టం చేసింది.
