బాంబే హైకోర్టు న్యాయమూర్తి శేషాద్రినాయుడు రాజీనామా

బాంబే హైకోర్టు న్యాయమూర్తి శేషాద్రినాయుడు రాజీనామా
  • 2024లో రిటైర్ కావాల్సి ఉండగా మూడేళ్ల ముందే పదవికి రాజీనామా
  • శేషాద్రినాయుడు స్వస్థలం చిత్తూరు జిల్లా

ముంబయి: బాంబే హైకోర్టు (మహారాష్ట్ర హైకోర్టు) న్యాయమూర్తి జస్టిస్ డి.శేషాద్రి నాయుడు తన పదవికి రాజీనామా సమర్పించారు. మరో మూడేళ్ల సర్వీసు ఉండగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 2024 జూన్‌లో ఈయన  రిటైర్‌ కావాల్సి ఉంది. తన రాజీనామాకు కారణాలను ఆయన వెల్లడించలేదు. అయితే వ్యక్తిగత కారాణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన దామా శేషాద్రినాయుడు ఎస్వీ యూనివర్సిటీ నుంచి న్యాయవాద కోర్సు చేశారు.
1977లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి హైదరాబాద్ హైకోర్టులో సివిల్, క్రిమినల్ లాయర్ గా అంచెలంచెలుగా ఎదిగారు. అటు తర్వాత జడ్జిగా ఎంపికైన ఆయన ఏపీ హైకోర్టు జడ్జిగా కూడా సేవలు అందించిన ఆయన  కేరళ కు బదిలీపై వెళ్లారు. అక్కడి నుంచి 2019లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ శేషాద్రినాయుడు రాజీనామాను బార్ అండ్ బెంచ్ ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది.