మాస్క్ ధరించని లాయర్…వాదించేందుకు నిరాకరించిన జడ్జి

మాస్క్ ధరించని లాయర్…వాదించేందుకు నిరాకరించిన జడ్జి

మాస్క్ ధరించక పోవడంతో ఓ లాయర్ వాదించే కేసును విచారించేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. నో మాస్క్‌, నో విచారణ అని కోర్టు తేల్చి చెప్పింది. ముంబై హైకోర్టుకు చెందిన సింగిల్‌ బెంచీ న్యాయమూర్తి పృథ్వీరాజ్‌ చవాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా లాయర్ తన వాదనలు వినిపించేందుకు మాస్క్‌ను తీసేసి వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యారు. దీనిని గమనించిన జస్టిస్‌ చవాన్‌ వెంటనే స్పందిస్తూ ఆ కేసును విచారించేందుకు నిరాకరించి.. మరో కొత్త తేదీని ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయంలో కోర్టులు ఆన్‌లైన్‌లోనే కేసులను విచారించాయి. ఈ మధ్య కాలంలో కోర్టులు విచారణ చేపడుతున్నాయి. విచారణ సమయంలో కూడా కోర్టులు కరోనా నిబంధనలు పాటిస్తూనే విచారణ జరుపుతున్నాయి. అదే సమయంలో కరోనా నిబంధనలను అనుసరించాలని తీర్మానించారు.

ఈ ఎస్‌ఓపీఎస్‌ ప్రకారం కోర్టులో న్యాయవాదులతో సహా ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించడం తప్పని సరి. కోర్టులో న్యాయ విచారణ జరిపేటప్పుడు ఆ కేసుకు సంబంధించిన వారు మాత్రమే కోర్టు హాలులో ఉండాలని, మిగతా లాయర్లంతా పక్క రూమ్‌లో తమ వంతు వచ్చే వరరకు వేచి చూడాలని అన్నారు జస్టిస్‌ పృథ్వీరాజ్‌. విచారణ సమయంలో సబార్డినేట్లు వాదిస్తున్నప్పుడు న్యాయస్థానంలో ఉన్న సీనియర్‌ జడ్జీలు కూడా మాస్క్‌లు తప్పకుండా ధరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.