కృష్ణుడి ఆశీస్సులు ఉంటే ఎంపీగా పోటీ చేస్త: కంగనా రనౌత్

కృష్ణుడి ఆశీస్సులు ఉంటే ఎంపీగా పోటీ చేస్త: కంగనా రనౌత్

ద్వారక: శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని బాలీవుడ్ యాక్టర్ కంగనారనౌత్ చెప్పారు. శుక్రవారం ఉదయం ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె.. ‘కృష్ణుడి ఆశీస్సులు ఉంటే తప్పకుండా పోరాడుతా’ అని తెలియజేశారు. 600 ఏండ్ల పోరాటం తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషితో అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు సాకారం అయిందని ప్రశంసించారు. సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని అన్నారు.