మిగ్ -29 కె విమాన పైలట్ కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహం లభ్యమైంది. నవంబర్ 26వ తేదీన రష్యాకు చెందిన జెట్ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుండి బయలుదేరిన మిగ్ 29 కే కొద్దిసేపటికే కమాండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయి.. సముద్రం లో కుప్పకూలిన పోయింది.
ఈ ఘటనలో ఒక పైలెట్ ను సహాయ బృందాలు కాపాడగా, నిశాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యారు. అప్పటినుండి నిశాంత్ సింగ్ కోసం భారత నేవీ బృందాలు భారత నావికాదళం తొమ్మిది యుద్ధనౌకలు, 14 విమానాలు మరియు అనేక ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్‌లు గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ కమాండర్ నిశాంత్ సింగ్ యొక్క జాడ దొరకలేదు. అయితే ఈ రోజు నిశాంత్ సింగ్ మృతదేహం గోవా తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. నీటి ఉపరితలానికి 70 మీటర్ల లోతు నుంచి నిశాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రోటోకాల్ ప్రకారం, అతని కుటుంబానికి సమాచారం అందించిన అధికారులు పోస్టుమార్టం నిమిత్తం నిశాంత్ సింగ్ మృతదేహాన్ని తరలించారు.
