పార్ట్ టైం రాపిడో నడుపుతున్న వీడియో జర్నలిస్ట్ యాక్సిడెంట్‌లో మృతి

రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడుతూ.. పని చేసుకుంటుంగా మృత్యువు అతన్ని ఓ ఖరీదైన కారు రూపంలో కబళించింది. చెన్నె పాండి బజార్‌కు చెందిన ప్రదీప్ కుమార్ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌లో కెమెరాపర్సన్‌గా పని చేస్తూ.. పార్ట్‌టైమ్ ర్యాపిడో డ్రైవర్‌గా చేస్తుంటాడు. చాలీచాలని జీతంతో పార్ట్ టైంలో బైక్ రాపిడో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నవంబర్ 19న రాత్రి మధురవాయల్‌, తాంబరం ఎలివేటెడ్‌ బైపాస్‌పై స్పీడ్ గా వస్తున్న బీఎండబ్ల్యూ కారు ప్రదీప్ బైక్ ని ఢీకొట్టింది. 

దీంతో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. బైక్ నడుతున్న ప్రదీప్ ఎగిరి 100 మీటర్ల దూరంలో పడ్డాడు. తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో ప్రదీప్ కుమార్ అక్కడిక్కడే చనిపోయాడు. కారు నడిపిన వ్యక్తి వాహనం అక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న BMW కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.