ఇంటర్నేషనల్ ఆటో మొబైల్ దిగ్గజం BMW లేటెస్టుగా భారత మార్కెట్లోకి c-400 GT మ్యాక్సీ స్కూటర్ ను తీసుకువచ్చింది. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్ లో అమ్ముతారు. ఇవాళ్టి(మంగళవారం) నుంచే బుకింగులు ప్రారంభమయ్యాయి. కంఫర్ట్, డైనమిక్ పెర్ఫార్మెన్స్, లాంగ్ డ్రైవ్ లకు అనుగుణమైన నిర్మాణం దీని ప్రత్యేకత.
స్కూటర్ అయినా.. దీని ధర మాత్రం మామూలుగా లేదు. ఎక్స్ షోరూమ్ ధర రూ.9.95 లక్షలు అని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీంట్లోనే స్టైల్ ట్రిపుల్ బ్లాక్ మోడల్ ఖరీదు రూ.10.15 లక్షలు అని ప్రకటించాయి.
ఈ స్కూటర్ లో సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ వాటర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. 7,500 RPM దగ్గర 33.5 BHP శక్తిని విడుదల చేస్తుంది. 9.5 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగం అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 139 కిలోమీటర్లు. డిజిటల్ కన్సోల్, ట్విన్ ఎల్ఈడీ హెడ్ లైట్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, హై విండ్ షీల్డ్, టీఎఫ్ టీ స్క్రీన్ సహిత ఫంక్షన్ క్లస్టర్.. ఈ మ్యాక్సీ సూటర్ లో ఆకర్షణీయమైన ఫీచర్లు.
