బాంద్రాలో ఉన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆఫీసును బృహన్ ముంబై కార్పొరేషన్(BMC) అధికారులు ఇవాళ(బుధవారం) కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన రోజు నుంచి కంగనా, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన ఆగ్రహం వ్యక్తం చేసింది. నా ముంబై ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటూ మరోసారి ట్విట్టర్ ట్వీట్ చేసింది.
ఎలాంటి తప్పు చేయలేదన్న కంగనా… కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్నినా శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘బాబర్, అతని సైన్యం’ అంటూ ఆఫీసు కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది. ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు… నా వరకు ఇది రామ మందిర్. గుర్తుంచుకోండి బాబర్, అతని సైన్యం రామ మందిరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశారు… కానీ దాన్ని మళ్లీ ఇప్పుడు నిర్మించారన్నారు. నా భవనం విషయంలో కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేసింది. కంగన ఇటీవలే రూ. 48 కోట్లతో ఈ కార్యాలయాన్ని కొన్నది.
కంగనా తనకు నచ్చినట్లు మాట్లాడుతుందన్నారు బీఎంసీ మేయర్ కిషోర్ పెడ్నేకర్. ఆమె ఆఫీసు కూల్చేసింది శివసేన పార్టీ కాదు, బీఎంసీ అన్నారు. అయితే దీనిపై కంగనా తరుపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. తన కార్యాలయం కూల్చివేతను నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే ఇచ్చింది.
मणिकर्णिका फ़िल्म्ज़ में पहली फ़िल्म अयोध्या की घोषणा हुई, यह मेरे लिए एक इमारत नहीं राम मंदिर ही है, आज वहाँ बाबर आया है, आज इतिहास फिर खुद को दोहराएगा राम मंदिर फिर टूटेगा मगर याद रख बाबर यह मंदिर फिर बनेगा यह मंदिर फिर बनेगा, जय श्री राम , जय श्री राम , जय श्री राम ? pic.twitter.com/KvY9T0Nkvi
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020
