Good Health: గ్లాసుడు నీళ్లలో ఇది చిటికెడు కలుపుకుని తాగితే షుగర్ మాయం 

Black Salt: మధుమేహం... డయాబెటిస్ ఈ వ్యాధి పేరు చెబితేనే జనాలు బెంబేలెత్తుతారు.  ఒకసారి వచ్చిందంటే జీవితాంతకాలం వదలిపెట్టదు.  పూర్వం 50 ఏళ్లు పైబడిన వారికి షుగర్ వచ్చేది.  కాని ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోను వ్యాపిస్తుంది.  . ఇదొక సైలెంట్ కిల్లర్ వ్యాధి అయినప్పటికీ కూడా కొన్ని సార్లు దీని లక్షణాలతో వ్యాధిని గుర్తించవచ్చు.  రోజు పొదద్దున్నే  వేడి నీటిలో నల్ల ఉప్పును కలుపుకుని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అయి.. క్రమేణ తగ్గే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

 ప్రస్తుత కాలంలో డయాబెటీస్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. . అయితే ఈ వ్యాధి చాలా మందిలో వ్యాపించడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ వ్యాధి కారణంగా శరీరం అంతా ముందుగా పొడిబారడం ప్రారంభమవుతుంది. అందువల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు పలు రకాల ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా కాలేయ సమస్యలు ఉన్న వారు కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

 షుగర్ సమస్యల బారిన పడినవారు తరచూ తీసుకునే ఆహారంలో తెల్ల ఉప్పును తీసుకుంటూ ఉంటారు. కానీ తెల్ల ఉప్పు కంటే నల్ల ఉప్పును తీసుకుంటే తరచూ మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకోవచ్చని అంటున్నారు. నల్ల ఉప్పులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో సోడియం కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది.

నల్ల ఉప్పును ఆహారంలో ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. మరోవైపు మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు కూడా నల్ల ఉప్పును తీసుకుంటే వెంటనే మంచి ఫలితం లభిస్తుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వారు కూడా నల్ల ఉప్పును తీసుకుంటే బరువు తగ్గుతారు. గ్యాస్, అజీర్ణం, కొలస్ట్రాల్, బరువు పెరగడం వంటి సమస్యలను కూడా నల్ల ఉప్పుతో తగ్గించుకోవచ్చు. 

నల్ల ఉప్పులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు సోడియం కూడా తక్కువగా ఉంటుంది. బ్లాక్ సాల్ట్ వాడడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. ఆరోగ్యకరమైన శరీరం కోసం మెగ్నీషియం, కాల్షియం, ఇనుము వంటివి పుష్కలంగా ఉండడం వల్ల కీళ్ల నొప్పులు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. గ్యాస్ వంటి సమస్యలను కూడా నల్ల ఉప్పుతో తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఎసిడిటీ, రక్తపోటు, జీర్ణ సమస్యలను కూడా నల్ల ఉప్పుతో తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.