ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది.  దేశంలోని కరోనా పరిస్థితులతో పాటు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సమావేశంలో చర్చిస్తామన్నారు బీజేపీ నేతలు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. దీనిపైనా డిస్కస్ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగియనుంది. 

కరోనా నిబంధనలతో మీటింగ్ కు జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. 124 మంది కార్యవర్గ సభ్యులు మాత్రమే ప్రత్యక్షంగా హాజరవుతారని చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గంలోని ఇతర సభ్యులు రాష్ట్ర కార్యాలయాల్లో వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ నుంచి బండి సంజయ్, వివేక్  వెంకటస్వామి, ఈటల రాజేందర్, రాజాసింగ్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు మీటింగ్ లో పాల్గొననున్నారు.