బెంగాల్ లో తృణమూల్ కార్యకర్తల దాడిలో గాయపడ్డట్టుగా చెబుతున్న 85 ఏళ్ల మహిళ షోవా మజుందార్ చనిపోయారు. ఫిబ్రవరి 28న తృణమూల్ కార్యకర్తలు షోవా మజుందార్ ను కొట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఆరోపణలను తృణమూల్ ఖండించింది. షోవా మజుందార్ మృతికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. ఆ కుటుంబం అనుభవించిన బాధలు... మమతా బెనర్జీని జీవితాంతం వెంటాడతాయన్నారు అమిత్ షా. హింసలేని రేపటి భవిష్యత్ కోసం బెంగాల్ పోరాడుతుందని అమిత్ షా ట్వీట్ చేశారు.
