ప్రపంచంలోనే పెద్ద పార్టీ బీజేపీ.. శోభాయాత్రలో నడ్డా

ప్రపంచంలోనే పెద్ద పార్టీ బీజేపీ.. శోభాయాత్రలో నడ్డా

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. రాజ్యసభలోనూ బీజేపీ 100 సీట్ల మార్క్ దాటిందన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కూడా లేడని అన్నారు. బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో జేపీ నడ్డా పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు జేపీ నడ్డా. కార్యకర్తలు రక్త దానం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని కరోల్‌ బాఘ్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ బీజేపీ పేదల పార్టీ అని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చిన పార్టీ బీజేపీ అని, కొన్ని పార్టీలు.. కుల, మతాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని నడ్డా అన్నారు. బీజేపీ మాత్రమే జాతీయవాద రాజకీయాలు చేస్తోందని, అధికారం కంటే దేశ హితమే తమకు ముఖ్యమని చెప్పారు. కుటుంబ రాజకీయాలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు వారి వారసుల ఎదుగుదల తప్ప ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోవని మండిపడ్డారు. అలాంటి పార్టీలను పూర్తిగా ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

ఆడపిల్ల పుట్టిందని సంబురాలు.. హెలికాప్టర్లో ఇంటికి

12 రాష్ట్రాల వడగాలుల హెచ్చరిక

షాంఘైలో కరోనా కలకలం.. లాక్డౌన్ పెట్టినా తగ్గని కేసులు