కాంగ్రెస్​లోకి జలంధర్​రెడ్డి

మక్తల్, వెలుగు: నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర నేత మాదిరెడ్డి జలంధర్ రెడ్డి శనివారం సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గురువారం బీజేపీకి రాజీనామా చేసిన ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, పాలమూరు ఎంపీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్ రెడ్డితో హైదరాబాద్ లో సీఎంను కలిశారు. ఆయ‌‌‌‌న‌‌‌‌కు కాంగ్రెస్  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. 

నారాయణపేట: నారాయణపేట మున్సిపల్  వైస్  చైర్మన్  హరినారాయణ భట్టడ్, మాజీ కౌన్సిలర్లు వినోద్, మారుతి, పట్టణానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్  పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జి శివకుమార్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మరికల్  మాజీ ఉప సర్పంచ్ శివకుమార్ తోపాటు వార్డు మెంబర్లు నాగరాజు, చంద్రయ్య, 100 మంది కాంగ్రెస్​లో చేరారు. నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్  జయంతి శ్రీనివాస్ రెడ్డితో పాటు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.