సంక్రాంతి నాటికి జిల్లాలకు కొత్త అధ్యక్షులు .. బీజేపీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంక్రాంతి నాటికి జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో సంస్థాగత ఎన్నికలపై సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ సమీక్షించారు. జిల్లాల్లో బూత్, మండల కమిటీల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా నేతలకు సూచించారు. 

రాష్ట్రంలో మొత్తం బీజేపీ 38 జిల్లాలుగా విభజించగా, దాంట్లో 30 జిల్లాల నేతలతో సమీక్షించారు. మంగళవారం మిగిలిన 8 జిల్లాలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. జనవరిలో రెండోవారం నాటికి జిల్లా ఎన్నికల ప్రక్రియ ముగించేలా స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాగా, డిసెంబర్ నెలాఖరు నాటికే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా, పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో షెడ్యూల్ లో మార్పులు జరిగినట్టు నేతలు చెప్తున్నారు.