ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 10మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఏపీలో ఈసారి టీడీపీ- జనసేన-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలు... జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు.. బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ క్రమంలో ఏపీలో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలు:
విశాఖ నార్త్ - విష్ణుకుమార్ రాజు
అరకు వ్యాలీ - రాజారావు
అనపర్తి - శివక్రిష్ణంరాజు
కైకలూరు - కామినేని శ్రీనివాస్
ఎచ్చెర్ల - ఈశ్వరరావు
విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
బద్వేల్ - బొజ్జ రోశన్న
జమ్మలమడుగు - ఆదినారాయణరెడ్డి
ఆదోని - పార్ధసారధి
ధర్మవరం - వై సత్య కుమార్
బీజేపీ ఎంపీ అభ్యర్థుల వివరాలు
అరకు - కొత్తపల్లి గీత
అనకాపల్లి - సీఎం రమేష్
రాజమహేంద్రవరం - పురందేశ్వరి
నర్సాపురం - భూపతిరాజు శ్రీనివాస వర్మ
తిరుపతి (ఎస్సీ) - వరప్రసాదరావు
రాజంపేట - కిరణ్ కుమార్ రెడ్డి