న్యూఢిల్లీ, వెలుగు: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఈసారి ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సోమవారం మూడు రాష్ట్రాల నుంచి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది.
ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్‌లకు చాన్స్ ఇచ్చింది. కాగా.. వైఎస్సార్‌సీపీ తరఫున గతంలో ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. అయితే, 2024 ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి, ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని ముందుండి నడిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు.