ముఖ్యమంత్రి గారు మీకు మతిభ్రమించినట్లుందే

ముఖ్యమంత్రి గారు మీకు మతిభ్రమించినట్లుందే
సీఎం కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతురని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. గత కొన్ని రోజులు నుంచి సీఎం మెంటల్ గా డిస్ట్రబ్  అయ్యారు. రోజుకో మాటతో యూటర్న్ ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. రైతుల పంట ప్రభుత్వం కొనకపోతే సీఎంగా ఎందుకు నువ్వు..? వెంటనే రాజీనామా చేసి ఎలక్షన్లకి రావాలని సవాల్ విసిరారు. రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేది బిల్లులో ఉంది ఆయన కొత్తగా సపోర్ట్ చేసేది ఏముందన్నారు. రైతుల పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే ప్రభుత్వం ఎందుకు’ అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎలక్షన్లలో ఓడిపోయినప్పుటి నుంచి భయం పట్టుకుందన్నారు. రైతుల పంటలను అన్ని రాష్ట్రాలు కొంటున్నాయి కేసీఆర్ ఒక్కడే కొనడంలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పంటల షరతుల విధానం పెట్టి రైతుల జీవితాలతో అడుకున్నావు..రాష్ట్ర ఖజానాను మై హోమ్ కి కాలేశ్వరం ప్రాజెక్టు లకు ధారా దత్తం చేసి అప్పులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని మళ్లీ యూ టర్న్ తీసుకున్న తీసుకుంటావు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రోజుకో అబద్ధం మాట్లాడితే ఎలా అని విమర్శించారు. రైతుల పంటలు అమ్మం , కొనం అంటే మేం చూస్తూ ఊరుకోమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు.