కరోనా వచ్చిందంటూ కోర్ట్ కు ఫేక్ రిపోర్ట్.. బీజేపీ ఎమ్మెల్యే పై కేసు

కరోనా వచ్చిందంటూ కోర్ట్ కు ఫేక్ రిపోర్ట్.. బీజేపీ ఎమ్మెల్యే పై కేసు
కరోనా వచ్చినట్లు ఫేక్ రిపోర్ట్ సమ్మిట్ చేసి కోర్ట్ విచారణను నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యేపై, అందుకు సహకరించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ పై కేసు నమోదైంది.ఉత్తర్ ప్రదేశ్ మెన్‌దావాల్ నియోజకవర్గం లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాకేష్ సింగ్ బాగెల్ తొలిసారి విజయం సాధించారు. అయితే 2010లో అటెంప్ట్ టూ మర్డర్ కేస్ తో పాటు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. నాటి నుంచి కోర్ట్ లో కేసు విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కోర్ట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు కరోనా సోకిందని, ఫేక్ రిపోర్ట్ తయారు చేయించారు. ఆ రిపోర్ట్ ను శాంత్ కబీర్ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హర్ గోవింద్ సింగ్ ద్వారా అడిషనల్ సెషన్స్ కోర్ట్ జడ్జ్ దీపంత్ మణికి అందించారు. అయితే దాన్ని నిర్ధారించుకునేందుకు సర్వైలైన్స్ టీమ్ అధికారి డాక్టర్ వివేక్ కుమార్ శ్రీవాస్తవను నియమించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ హోం ఐసోలేషన్ లో లేరని, ఫోన్ కలవడం లేదని కోర్ట్ కు తెలిపారు. ఎమ్మెల్యే తీరుపై సర్కిల్ ఆఫీసర్ గయా దత్ మిశ్రా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ ఫేక్ కరోనా రిపోర్ట్ లను కోర్ట్ కు సమ్మిట్ చేసినందుకు గాను 419, 420, 467, 468 మరియు 471 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు వెల్లడించారు.