మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలోని ఎస్సీ డెవలప్మెంట్స్కీమ్ కింద బెస్ట్ అవైలెబుల్ప్రవేశాలలో క్రిస్టియన్ స్టూడెంట్స్ను ఎంపిక చేయవద్దని ఈ విషయంలో అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్ అన్నారు. శనివారం అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారి విజయలక్ష్మీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బెస్ట్ అవైలెబుల్ స్కూళ్ల ప్రవేశాలలో ఎస్సీలుగా ఉన్న నిజమైన వారికే చోటు కల్పించాలని ఎస్సీల పేరుతో కొంతమంది క్రిస్టియన్స్ రిజర్వేషన్లను అనుభవిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంలో నిజమైన ఎస్సీ హిందువులకే బెస్ట్ అవైలెబుల్ స్కూళ్లలో అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రెసిడెంట్వీణ, జనరల్ సెక్రెటరీలు శ్రీనివాస్, లక్ష్మీనర్సింహారెడ్డి, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ప్రసాద్, ఆయా మండలాల ప్రెసిడెంట్స్ రాజు, రాములు, భాను, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాశీనాథ్, సంగీత, దుర్గాప్రసాద్, విఠలేశ్, రాము, భాను పాల్గొన్నారు.