బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ సూసైడ్!

బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ సూసైడ్!

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌‌లోని మండికి చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ (62) మృతి చెందారు. ఢిల్లీలోని తన ప్లాట్‌‌లో శర్మ సీలింగ్‌‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోవడం కలకలం రేపింది. శర్మకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

‘బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఓ స్టాఫర్ నుంచి కాల్ అందడంతో మేం అక్కడికి చేరుకున్నాం. ఆయన ఉరి వేసుకొని చనిపోయారు. సదరు రూమ్‌‌కు లోపలి వైపు నుంచి గడి వేసి ఉంది’ అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. రామ్ శర్మ మృతిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శర్మ హఠాన్మరణం తనను విస్మయానికి గురి చేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని షా ట్వీట్ చేశారు.