బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీనామా

చిన్నచింతకుంట, వెలుగు: బీజేపీ మహబూబ్ నగర్  జిల్లా ప్రధాన కార్యదర్శి నంబి రాజు తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. జిల్లాలో సీనియర్లకు విలువ లేకుండా పోయిందని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు పెత్తనం చెలాయిస్తూ పార్టీ విలువలను దిగజారుస్తున్నారని ఆరోపించారు. డీకే అరుణ పార్టీని విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. ఆయన వెంట దేవరకద్ర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.