Rahul Gandhi: రాహుల్ గాంధీపై బీజేపీ అటెంప్ట్ టు మర్డర్ కేసు!

పార్లమెంట్ ఆవరణలో బీజేపీ నేతలపై దాడి కి పాల్పడ్డారంటూ లోక్ సభ పక్ష నేత  రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు కేసు పెట్టారు. రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో రాహుల్ పై సెక్షన్ 109,115,117,125, 131, 351 కింద ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రత్యేకంగా సెక్షన్ 109 హత్యాయత్నం కింద పేర్కొన్నారు.

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను అవమానించారని పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు నిరసన తెలుపుతుండగా.. ఎన్డీయే ఎంపీలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో జరిగి తోపులాటలో మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్రసారంగికి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ సీనియర్ గాంధీ సీనియర్ సభ్యుడు ప్రతాప్ చంద్రసారంగిని నెట్టారని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే బీజేపీ ఆరోపణలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. 

ALSO READ | అమిత్షాను కాపాడటం కోసమే..కొట్టినట్లు బీజేపీ డ్రామా: ఎంపీ ప్రియాంక గాంధీ

పార్లమెంట్ ఆవరణలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్షాలపై బీజేపీ ఎంపీలు రెచ్చగొట్టడం వల్లే వివాదం తలెత్తిందని ఆరోపించారు. బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే, సీనియర్ నాయకుడిని రాహుల్ గాంధీ నెట్టారని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తుండగా.. పార్లమెంటులో ప్రవేశించడానికి వెళ్తున్న సమయంలో బిజెపి ఎంపీలు నన్ను అడ్డుకున్నారు.. నన్ను నెట్టారు, బెదిరించారని.. తాను ఎవరిని కొట్టలేదని.. నెట్టలేదని  అని రాహుల్ గాంధీ అన్నారు.