హైదరాబాద్ శంషాబాద్లో బీజేపీ నేతల అరెస్ట్

శంషాబాద్, వెలుగు: ఆరాంఘర్​–- జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుంటారనే సమాచారం రావడంతో శంషాబాద్ లో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎలైట్ హోటల్లో బీజేపీ నాయకులు సోమవారం సమావేశం నిర్వహించగా, భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నాయకులు తోకల శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రాజ్ యాదవ్, బుక్క వేణుగోపాల్, రాజ్ భూపాల్, చిటికెల వెంకటయ్య, రాజిరెడ్డి, వేణు, చంద్రయ్యను అరెస్ట్ చేసి రూరల్ పీఎస్​కు తరలించారు. ఈ క్రమంలో ఏసీపీ శ్రీనివాసరావుతో మైలార్​దేవపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.