ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి వచ్చిండో తెలుసుకోండి : డీకే అరుణ

కొత్తకోట, వెలుగు: ఇతర పార్టీలో గెలిచిన నా యకులను కాంగ్రెస్లో చేర్చుకుంటున్న వారు తమ గురించి మాట్లాడే అర్హత లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ నాయకుల పై మండిపడ్డారు. గురువారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ముందు మీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారో తెలుసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు చుర కలంటించారు.

సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు తెచ్చింది తానే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబె ట్టిందని ఎద్దేవా చేశారు. మందరోజులైనా ఆరు గ్యారెంటీలు ఇవ్వడంలో విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణాలో అభివృద్ధి జర గాలంటే బీజేపీ ఎంపీలను గెలిపించాలని డీకే అరుణు కోరారు. కార్యక్రమంలో మండల అధ్య క్షుడు కోటేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు భరత్ భూషణ్, నారాయణమ్మ, నవీన్, శివరాములు తదితరలు పాల్గొన్నారు.